1. మీ గోశాల పేరు ఏమిటి?
సమాధానం: నాడీపతి గోశాల
2. మీ గోశాలల పూర్తి చిరునామా ఏమిటి?
సమాధానం:
ఆంధ్రప్రదేశ్: నాడీపతి గోశాల, నాడీపతి విలేజ్, లింగంపర్తి, ఏలేశ్వరం మండలం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్.
తెలంగాణ: నాడీపతి గోశాల, నాడీపతి విలేజ్, ఎన్కతల దగ్గర, మోమిన్‌పేట్ మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ.
3. గోశాల ఎప్పుడు ప్రారంభించారు?
సమాధానం:
- ఆంధ్రప్రదేశ్‌లో 2007లో ప్రారంభించాము.
- తెలంగాణలో 2025లో ప్రారంభించాము.
4. ప్రారంభంలో ఎన్ని ఆవులతో మొదలుపెట్టారు?
సమాధానం: 2005లో కాకినాడలో కేవలం ఒక ఆవుతో ప్రారంభించాను.
5. ప్రస్తుతం మీ వద్ద మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి?
సమాధానం: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 10,600 ఆవులు ఉన్నాయి.
6. ఐదు అడుగుల ఆవును రెండు అడుగుల లోపు తీసుకురావడానికి ఎంత సమయం పట్టింది?
సమాధానం: మొత్తం 18 సంవత్సరాలు పట్టింది.
- 5 అడుగుల నుంచి 3 అడుగుల లోపు – 6 సంవత్సరాలు (మినియేచర్ పుంగనూరు)
- 3 అడుగుల నుంచి 2 అడుగుల వరకు – 4 సంవత్సరాలు (మినియేచర్)
- 2 అడుగుల లోపు – 4 సంవత్సరాలు (మైక్రో మినియేచర్)
- 1 అడుగు ఎత్తు వరకు – 3 సంవత్సరాలు (నాడీపతి నానో)
ప్రస్తుతం ఈ జాతులను:
- మినియేచర్
- మైక్రో
- నానో అనే మూడు విభాగాలుగా అభివృద్ధి చేశాము.
7. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాల్లో గోశాలలు ఉన్నాయి?
సమాధానం: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి.
8. పెద్ద ఆవులను చిన్నగా చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?
సమాధానం: భారతీయ సనాతన ధర్మంలో ప్రతి ఇంటిలో ఆవు ఉండేది. కానీ కాలక్రమేణా పెద్ద ఇళ్లు చిన్నవిగా మారాయి, అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరిగింది. దీంతో ఆవులను పెంచుకునే అవకాశం తగ్గింది.
మన అవసరాలకు అనుగుణంగా బోన్సాయ్ చెట్లు, అక్వేరియం చేపలు, చిన్న జాతి కుక్కలు వచ్చినట్లే, ప్రతి ఇంటిలో సులభంగా పెంచుకునే విధంగా చిన్న పరిమాణంలో భారతీయ ఆవులను అభివృద్ధి చేయాలని సంకల్పించాను.
నాడీపతి ఆక్యుపంక్చర్ (ట్రీట్మెంట్) విధానం ద్వారా సుమారు 10 తరాల పాటు పరిశోధన చేసి, ఐదు అడుగుల ఎత్తు ఉన్న ఆవును ఒక అడుగు ఎత్తు వరకు తీసుకురావడం జరిగింది.
9. ఇప్పటివరకు ఎంతమందికి ఆవులను అందించారు?
సమాధానం: సుమారు లక్ష మందికి పైగా ఆవులను పంపిణీ చేశాము.
మా ప్రయత్నాల వల్ల ఇప్పుడు గ్రామాల్లోనే కాకుండా పట్టణాలు, అపార్ట్‌మెంట్లలో కూడా ఆవులను పెంచుతున్నారు.
2013లో నేను కౌ హగ్ థెరపీ (Cow Hug Therapy) అనే భావనను ప్రారంభించాను. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు ఆవు ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాయి.
10. మీరు ఆవులను అందించిన ప్రముఖులు ఎవరు?
సమాధానం: మా గోవులను అందుకున్న ప్రముఖుల్లో:
- భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు – 6 ఆవులు, 1 ఎద్దు
- ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు – 1 ఆవు, 1 ఎద్దు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు – 2 ఆవులు, 1 ఎద్దు
- ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ అనంత్ అంబానీ గారు
- ఇంకా అనేక మంది ముఖ్యమంత్రులు, మంత్రులు, స్వామీజీలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు.
11. మీ భవిష్యత్ లక్ష్యం ఏమిటి?
సమాధానం: భవిష్యత్తులో ప్రతి ఇంటిలో ఒక ఆవు ఉండాలనేది నా లక్ష్యం.
2 అడుగుల ఎత్తు, రోజుకు 2 లీటర్ల పాల దిగుబడితో కూడిన ఆవు మరియు ఎద్దును రూ.10,000కు అందించి, ప్రతి భారతీయ కుటుంబంలో గోమాతను తిరిగి స్థాపించాలనేది నా ఆశయం.
12. ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా అవసరమా?
సమాధానం: ప్రభుత్వం నుంచి నాకు వ్యక్తిగతంగా ఏమీ అవసరం లేదు.
నాది ఒక్కటే విజ్ఞప్తి:
"ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి."
జై గోమాత!
సంప్రదించండి
డా. పి. కృష్ణం రాజు – నాడీపతి క్యాటిల్స్
📍 నాడీపతి గోశాల
GX43+GGJ, ఎంకతల గ్రామం, మోమిన్‌పేట్ మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ – 501202
📞 +91 88850 11323
📞 +91 88860 11320
📞 +91 88850 11322
📞 +91 94910 23454
🌐 హిందీ & అంతర్జాతీయ సమాచారం: +91 88850 11321
🌐 కన్నడ సమాచారం: +91 88860 11321
🌐 వెబ్‌సైట్: www.minicows.co.in
📧 ఇమెయిల్: punganurcowskkd@gmail.com

No comments:
Post a Comment